తెలంగాణలో కొత్త రాజకీయ పార్టీ అవసరం ఉంది: ప్రొఫెసర్ కోదండరామ్

04-02-2018 Sun 18:24 | Both States
  • జేఏసీ విస్తృత స్థాయి సమావేశం 
  • కొత్త పార్టీని ఏర్పాటు చేసినా, జేఏసీని కలుపుకుని పోతాం
  • జేఏసీని కాపాడుకోగలిగితేనే సమాజానికి మేలు జరిగేది
  • కొత్త రాజకీయ పార్టీ గురించి ఈ నెలాఖరులోగా స్పష్టంగా చెబుతాం 
తెలంగాణలో కొత్త రాజకీయపార్టీ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ అన్నారు. హైదరాబాద్ లోని తుర్కయాంజల్ సమీపంలోని సామా శ్రీనివాస్ రెడ్డి గార్డెన్స్ లో నిర్వహించిన జేఏసీ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, కొత్త పార్టీని ఏర్పాటు చేసినా, జేఏసీని కలుపుకుని పోతామని అన్నారు. ఉద్యమకారులకు గుర్తింపు రావాలంటే రాజకీయ పార్టీ అవసరమని, జేఏసీ అనేది దాని స్వభావ రీత్యా పార్టీ కాదని, దానిని పార్టీగా మార్చడమనేది మంచి సంప్రదాయం కాదని అన్నారు.

పౌరవేదికలు బలంగా ఉంటేనే ప్రజాస్వామ్యం బలంగా ఉంటుంది కనుక, జేఏసీని కాపాడుకోగలిగితేనే సమాజానికి మేలు జరుగుతుందని చెప్పారు. కొత్త రాజకీయ పార్టీ గురించి ఈ నెలాఖరులోగా స్పష్టంగా చెబుతామని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే మన వాడే కుర్చీలో కూర్చుంటాడని  ప్రజలకు మేలు జరుగుతుందని భావించామని, ప్రస్తుత పరిణామాలు మాత్రం అందుకు విరుద్ధంగా ఉన్నాయని విమర్శించారు. రైతు సమస్యలపై ప్రభుత్వానికి ఎన్ని నివేదికలు ఇచ్చినా స్పందించలేదని, రాష్ట్ర ప్రజలు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారని, గట్టిగా పోరాడటం ద్వారానే ప్రజాసమస్యలకు పరిష్కారం లభిస్తుందని అన్నారు.
Telanganajackondanda ram

More Telugu News

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39

భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12

"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ

24-10-2026 Sat 20:07

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14

'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి

24-10-2026 Sat 19:13

ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు

24-10-2026 Sat 18:59

వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు

24-10-2026 Sat 18:55

పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్

24-10-2026 Sat 18:44

సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు

24-10-2026 Sat 18:30

షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ

24-10-2026 Sat 18:21
..more